వేదికపై గుండెపోటుతో ‘రామలీల’ రాముడు మృతి | Ram During Ramlila Died of a Heart Attack | Sakshi
Sakshi News home page

వేదికపై గుండెపోటుతో ‘రామలీల’ రాముడు మృతి

Published Sun, Oct 6 2024 11:12 AM | Last Updated on Sun, Oct 6 2024 11:47 AM

Ram During Ramlila Died of a Heart Attack

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్తరాదిన నవరాత్రి వేడుకల్లో ‘రామలీల’ను ప్రదర్శిస్తుంటారు. రాజధాని ఢిల్లీలోని ఒక ప్రాంతంలో ‘రామలీల’ ప్రదర్శిస్తుండగా వేదికపై విషాదం చోటుచేసుకుంది.

ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని విశ్వకర్మ నగర్‌లో వేదికపై రామలీల ప్రదర్శిస్తుండగా రాముడి పాత్ర పోషిస్తున్న ఓ కళాకారుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో  వైరల్‌గా మారింది. రాముని పాత్ర పోషిస్తున్న నటుని పేరు సుశీల్ కౌశిక్(45) ఆయన స్టేజ్‌పై రాముని పాత్రలో డైలాగులు చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో, అతనితో పాటు ఇతర కళాకారులు కూడా వేదికపై ఉండటాన్ని చూడవచ్చు. 

ఇంతలో అకస్మాత్తుగా సుశీల్ తన గుండెపై చేయి వేసుకుని స్టేజి వెనుక వైపు వెళ్లడం కనిపిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేదికపై రాముని పాత్రధారి సుశీల్‌కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు.  అక్కడ సుశీల్‌ మృతిచెందాడు. సుశీల్ కౌశిక్ వృత్తిరీత్యా ప్రాపర్టీ డీలర్ అని తెలుస్తోంది. 


 

ఇది కూడా చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement