Ramlila
-
వేదికపై గుండెపోటుతో ‘రామలీల’ రాముడు మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్తరాదిన నవరాత్రి వేడుకల్లో ‘రామలీల’ను ప్రదర్శిస్తుంటారు. రాజధాని ఢిల్లీలోని ఒక ప్రాంతంలో ‘రామలీల’ ప్రదర్శిస్తుండగా వేదికపై విషాదం చోటుచేసుకుంది.ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని విశ్వకర్మ నగర్లో వేదికపై రామలీల ప్రదర్శిస్తుండగా రాముడి పాత్ర పోషిస్తున్న ఓ కళాకారుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రాముని పాత్ర పోషిస్తున్న నటుని పేరు సుశీల్ కౌశిక్(45) ఆయన స్టేజ్‌పై రాముని పాత్రలో డైలాగులు చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో, అతనితో పాటు ఇతర కళాకారులు కూడా వేదికపై ఉండటాన్ని చూడవచ్చు. ఇంతలో అకస్మాత్తుగా సుశీల్ తన గుండెపై చేయి వేసుకుని స్టేజి వెనుక వైపు వెళ్లడం కనిపిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేదికపై రాముని పాత్రధారి సుశీల్‌కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుశీల్ మృతిచెందాడు. సుశీల్ కౌశిక్ వృత్తిరీత్యా ప్రాపర్టీ డీలర్ అని తెలుస్తోంది. दिल्ली: शाहदरा में रामलीला में राम का किरदार निभाने वाले शख्स की हार्ट अटैक से मौत । सुशील कुमार रामलीला में राम का किरदार निभा रहे थे, प्रोग्राम के दौरान ही हार्ट अटैक आया और मौत हो गई। उनकी उम्र करीब 45 साल है।सुशील कौशिक एक प्रॉपर्टी डीलर थे#HeartAttack @hyderabaddoctor pic.twitter.com/nQIwBXkAF9— Shalu Awasthi شالو اوستھی (@Shalu_official) October 6, 2024ఇది కూడా చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..! -
రామ్‌లీలా ప్రదర్శనతో అలరించిన రష్యన్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి ముందు రోజు నిర్వహించనున్న దీపోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 12 మంది రష్యన్ కళాకారుల బృందం రామలీలాను ప్రదర్శించింది. ఈ మేరకు శనివారం రష్యన్ కళాకారుల బృందం సాంప్రదాయ దుస్తులతో వేషాలు వేసుకుని రామలీలా ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. మాస్కోలోని ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ సొసైటీ అధ్యక్షుడు పద్మశ్రీ గెన్నాడి మిఖైలోవిచ్ పెచ్చికోవ్ మెమోరియల్ ఆధ్వర్యంలో రష్యా కళాకారుల బృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ క్రమంలో ప్రదర్శన దర్శకుడు, నిర్మాత రామేశ్వర సింగ్ మాట్లాడుతూ...యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తమకు రష్యన్ బృందం చేత రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించేలా భారత్‌లో ఒక వేదికను అందించారని అన్నారు. 1960 నుంచి రష్యాలో రామ్‌లీలా చాలా ప్రముఖంగా ప్రదర్శించబడుతున్నట్లు సింగ్ తెలిపారు. వారందరికి భాష కష్టం కాలేదు గానీ పాత్రలను పోషించడంలో ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఈ మేరకు ఒక రష్యన్ నటి మాట్లాడుతూ తాను సీతగా నటించడాని సుమారు మూడు నెలలు ప్రాక్టీస్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అంతేగాదు దీపావళి రోజున జరిగే దీపోత్సవ్ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా 15 లక్షలకు పైగా దీపాలను వెలిగించనున్నారు. దీన్నీ వీక్షించేందుకు ప్రధాని మోదీ కూడా ఆదివారం అయోధ్య సందర్శించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: మహిళపై మంత్రి చేతివాటం ... తర్వాత పాదాలను తాకి...) -
Prabhas: రావణ దహనంలో పాల్గొన్న ప్రభాస్
ఢిల్లీ: సౌత్ స్టార్ల క్రేజ్ దేశం మొత్తం విస్తరిస్తోంది. తాజాగా టాలీవుడ్ నటుడు ప్రభాస్ ‘రావణ దహన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయదశమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఢిల్లీ లవ్ కుశ్ రామ్‌లీల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన సందడి చేశారు. ఆయన్ని చూసేందుకు, ఫొటోలు తీసేందుకు జనం ఎగబడ్డారు. భారత సంస్కృతి పట్ల ప్రభాస్‌కు ఉన్న అంకిత భావం చూసే ఆయన్ని పిలిచామని లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ ప్రెసిడెంట్ అర్జున్ కుమార్ ప్రకటించారు. కోవిడ్ ఫరిస్థితుల్లో రెండేళ్లుగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అందువల్ల కమిటీ నిర్వహకులు ఈ సారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించగా.. ప్రభాస్ అతిథిగా పాల్గొనడం విశేషం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు దేశం మొత్తం ఆయన పేరు, ప్రఖ్యాతలు విస్తరించాయి. మన భారత చరిత్రలో వేళ్లానుకున్న కథలను ఆయన చిత్రాలుగా ఎంచుకుంటున్నారు. బాహుబలి లాంటి కథతో పాటు ఇప్పుడు ఆదిపురుష్ లాంటి పౌరాణిక చిత్రంలో ఆయన నటించారు. రాముడి పాత్రలో నటించారు గనుకే రావణ దహనం ఈ ఏడాది ఆయనతో చేయిస్తున్నాం అని కుమార్ ప్రకటించారు. ఇక రామ్ లీలా మైదానంలో ఆదిపురుష్ టీం సందడి చేసింది. ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్, టీ సిరీస్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు వాళ్లిచ్చిన కానుకలను స్వీకరించాడు ప్రభాస్. ఆపై విల్లు ఎక్కుపెట్టి.. రావణ దిష్టిబొమ్మకు సంధించాడు. కార్యక్రమం చివర్లో.. రామావతారంలో ఉన్న నటులకు డైరెక్టర్ ఓం రౌత్‌తో కలిసి హారతి పట్టాడు ప్రభాస్. అంతకు ముందు రామాయణంలోని ఘట్టాలు ప్రదర్శించే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆదిపురుష్ టీజర్‌ను సైతం ప్రదర్శించారు. धर्म की विजय हो! 'आदिपुरुष' प्रभास ने दिल्ली की लव कुश रामलीला में तीर चलाकर किया रावण वध..#PrabhasIsAdipurush #Prabhas #Adipurush #Ramleela #LuvKushRamleela #Delhi #RavanDahan pic.twitter.com/bd56ODTe8h — GNTTV (@GoodNewsToday) October 5, 2022 Video Credits: GNTTV Twitter -
సీతపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
రుద్రాపూర్ : దసరా సమయంలో ఉత్తర భారతంలోని అన్ని గ్రామాల్లోనూ దాదాపు రామ్‌లీలా నాటకం వేస్తారు. సీతారాముల గొప్పతనం నేటి తరానికే తెలియజేసేందుకే ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. అయితే ఉత్సవాల్లో భాగంగా రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించిన ఓ బీజేపీ ఎమ్మెల్యే సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీత మేరీ జాన్’. అంటూ అసభ్యకరంగా సంభోదించి చిక్కుల్లో పడ్డారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ తుక్రాల్.. గత ఆదివారం నియోజకవర్గంలో ప్రదర్శించిన రామ్‌లీలా నాటకంలో రావణాసురుడు పాత్ర వేశారు. సీతా దేవి, రావణునికి మధ్య వచ్చే సన్నివేశంలో భాగంగా ‘ సీతా మేరీ జాన్’ అంటూ సీతా దేవిని సంభోదించారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వారు. అయితే నాటక నిర్వాహకులు మాత్రం అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ ఆయన అలాగే సంభోదించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ వీడియోపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సూర్యకాంత్ స్పందిస్తూ.. ఈ ఒక్క మాట చాలు రాజ్‌కుమార్‌కు సీతారాములపై ఉన్న గౌరవం ఏంటో తెలిసిపోయిందన్నారు. రావణుడు కూడా సీతమ్మను ఎప్పడూ ‘ సీతా దేవి’ అని సంభోదించేవాడని గుర్తుచేశారు. రాజ్‌కుమార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, రాజ్‌కుమార్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. నాటకంలో భాగంగానే తాను సీతాదేవిని ‘మేరీ జాన్’ అని సంభోదించానని, అంతేకానీ వేరే ఉద్దేశంతో కాదన్నారు. అక్కడ మాట్లాడింది కేవలం రావణాసుర పాత్రదారే తప్ప రాజ్‌కుమార్ కాదన్నారు. -
ఇలాంటి ప్రేమకథ రాలేదు!
- దాసరి కిరణ్‌కుమార్ ‘‘ప్రేమకథలకు ట్రెండ్‌తో పని లేదు. కథ గొప్పగా ఉంటే విజయం ఖాయం. ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎన్నో వందల, వేల ప్రేమకథలు వచ్చాయి. మేము చేస్తున్న ఈ ప్రేమకథ తరహాలో ఇంతవరకూ ఏదీ రాలేదు’’ అని నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ చెప్పారు. హవీష్, అభిజిత్, నందిత కాంబినేషన్లో రామదూత క్రియేషన్స్ పతాకంపై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘రామ్‌లీల’. శుక్రవారం సంస్థ కార్యాలయంలో జరిగిన దాసరి కిరణ్‌కుమార్ పుట్టినరోజు వేడుకల్లో పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుద్‌హుద్ తుపాను బాధితులకు మూడు లక్షల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. అనంతరం దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘మలేసియా నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రేమ, వినోదం, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. ‘దీవానా’లో షారుక్ ఖాన్ చేసిన పాత్ర తరహాలో ఇందులో హవీష్ పాత్ర ఉంటుంది. అభిజిత్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఈ కథ నచ్చి ఎస్. గోపాల్‌రెడ్డి ఛాయాగ్రాహకునిగా చేయడానికి అంగీకరించారు. ఇప్పటికి 95 శాతం సినిమా పూర్తయ్యింది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్నా, మాటలు: విస్సు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేశ్, సమర్పణ: లంకాల బుచ్చిరెడ్డి, సారథ్యం: కోనేరు సత్యనారాయణ. -
ముజఫర్‌నగర్ రాళ్ల దాడిలో మహిళకు తీవ్రగాయాలు
ముజఫర్‌నగర్ జిల్లాలోని కవల్ పట్టణంలో గత రాత్రి రామ్‌లీలాలో జరుగుతున్న సదస్సుపై ఆగంతకులు రాళ్ల దాడిలో మహిళ తీవ్రంగా గాయడిందని పోలీసు ఉన్నతాధికారి ముఖేష్ చంద్ర మిశ్రా శనివారం వెల్లడించారు. ఆమెను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మరింత మెరుగైన వైద్య సహాయం కోసం ముజఫర్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారన్నారు. కాగా రాళ్ల దాడి జరిగిన వెంటనే కొద్దిపాటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని, అయితే అదనపు బలగాలను హుటాహుటిన రప్పించి స్థానికంగా మోహరించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. రాళ్ల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ముజఫర్‌నగర్‌లో గతనెలలో చోటు చేసుకున్న మత ఘర్షణల్లో 62 మంది మరణించారు. అలాగే 43 వేల మంది నిరాశ్రయులు అయిన సంగతి తెలిసిందే.