
టేక్మాల్(మెదక్): మండలం లోని బొడ్మట్‌పల్లిలో గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వీరభద్రుడి కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారం కల్యాణ వేడుకలో పది జంటలు పాల్గొన్నాయి. వివాహ వేడుకలకు ఏడుపాయల ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్ వీరభద్రుడికి పట్టువస్త్రాలను సమర్పించారు.
కాగా కల్యాణాన్ని తిలకిచేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వీరికి ఆలయ నిర్వాహకులు అన్నప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్, సర్పంచ్ బీరప్ప, మండల ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రవిశంకర్, నాయకులు నిమ్మరమేష్, దశరథ్‌గౌడ్, ఈశ్వరప్ప, బేగరి మొగులయ్య, శ్రీనివాస్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.