bhrahmostavam
-
ముగింపు దశకు చేరుకున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
ఘనంగా వీరభద్రుడి కల్యాణం
టేక్మాల్(మెదక్): మండలం లోని బొడ్మట్‌పల్లిలో గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వీరభద్రుడి కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారం కల్యాణ వేడుకలో పది జంటలు పాల్గొన్నాయి. వివాహ వేడుకలకు ఏడుపాయల ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్ వీరభద్రుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. కాగా కల్యాణాన్ని తిలకిచేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వీరికి ఆలయ నిర్వాహకులు అన్నప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్, సర్పంచ్ బీరప్ప, మండల ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రవిశంకర్, నాయకులు నిమ్మరమేష్, దశరథ్‌గౌడ్, ఈశ్వరప్ప, బేగరి మొగులయ్య, శ్రీనివాస్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. -
మీనాక్షి బ్రహ్మోత్సవం
మదురై అంటే.. అందరికీ గుర్తుకొచ్చేది మీనాక్షి అమ్మవారి సన్నిధి. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నది సాక్షాత్తు పార్వతీ దేవి అవతారమే. పురాణాల మేరకు మదురై పాలకుడు మలయ ధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి ఒక చిన్న పాప రూపంలో భూమి మీదకు పార్వతీదేవి అడుగు పెడతారు. పెరిగి పెద్దయిన ఆమెను వివాహం చేసుకునేందుకు సుందరేశ్వరుడిగా శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివ, పార్వతులకు భూమి మీద జరిగిన ఈ వివాహ ఘట్టాన్ని తిలకించేందుకు సమస్తలోకాలు తరలి వచ్చినట్టుగా పురాణాలు చెబుతాయి. ఆ మేరకు ప్రతి ఏటా మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చైత్రమాస (చిత్తిరై) ఉత్సవాలు కనులపండువగా నిర్వహిస్తారు. సాక్షి, చెన్నై: మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. బుధవారం జరిగిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టాలు 25న అమ్మవారి పట్టాభిషేకం, 27న వివాహ మహోత్సవం, 29న కళ్లలగర్ వైగై నదీ ప్రవేశ సేవలు సాగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మదురైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రహ్మోత్సవ శోభ ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ, ఆలయ పాలకమండలి చర్యలు తీసుకుంది. ఆలయ పరిసరాల్లో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. దక్షిణ తమిళనాడులోని భక్త జనం ఇక, అమ్మవారిని దర్శించి పునీతులయ్యేందుకు మదురై బాట పట్టనున్నారు. ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ఆలయంలో ఉదయం నుంచి విశిష్ట పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సర్వాలంకారాలతో స్వామి, అమ్మవార్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి, ధ్వజ స్తంభం వద్ద అధిష్టింప చేశారు. ఆలయ శివాచార్యులు విశిష్ట పూజలతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మేళ తాళాలు, శివనామస్మరణ నడుమ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతూ ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం, రాత్రుల్లో అమ్మవారు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. బంగారు వాహనాల్లో మాడ వీధుల్లో తిరుగుతూ భక్తుల్ని కటాక్షిస్తారు. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కల్యాణ వైభోగమే ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టాలు నాలుగు. ఇందులో అమ్మ వారి పట్టాభిషేకానంతరం తొలి ముఖ్య ఘట్టం. ఈవేడుక ఈనెల 25న జరగనుంది. 27వ తేదీన భక్త జన సందోహం నడుమ మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వారి వివాహ మహోత్సవం కనుల పండువగా జరుగుతుంది. ఆ మరుసటి రోజున 28వ తేదీన రథోత్సవం వైభవంగా సాగనుంది. ఈ ఉత్సవాల్లోనే అత్యంత ముఖ్య ఘట్టం కళ్లలగర్(విష్ణువు) వైగై నదీ ప్రవేశం 29వ తేదీన నిర్వహిస్తారు. మూడో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కనులపండువలా సాగుతాయి. భద్రత కట్టుదిట్టం మదురై తీవ్ర వాదుల హిట్ లిస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆలయ పరిసరాల్లో భద్రత నిత్యం పటిష్టంగానే ఉంటుంది. అయితే, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మదురై జిల్లా యంత్రాంగం భద్రతను మరింతగా పెంచింది. ప్రధాన ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తారు కాబట్టి, ఆ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల గోపురం వీధిలోని దుకాణాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. దుకాణాలదారులకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. -
పట్టాభిరాముడు
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇల్లందకుంట కోదండరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ పూజారులు శేషం రామాచార్యులు, సీతారామచార్యులు శాస్త్రోక్తంగా ఘనంగా జరిపించారు. ప్రతి ఏటా నిర్వహించే పట్టాభిషేక మహోత్సవాన్ని కటంగూరి రంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ పూజారులు సీతా రాములను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి, సీతమ్మ తల్లికి నగలను అలంకరించి మహోత్సవాన్ని వందలాది మంది భక్తులు వీక్షిస్తుండగా జరిపించారు. అన్నదానం నిర్వహించా రు. సీతారాములను పల్లకిలో ఊరేగించారు. ఆలయ నిర్వహణాధికారి రాజ్‌కుమార్, చైర్మన్ ఎక్కటి సంజీవరెడ్డి, సర్పంచ్ పెద్ది స్వరూపకుమార్, ఎంపీటీసీ రామ్‌స్వరణ్‌రెడ్డి, సీఐ నారాయణ, ధర్మకర్తలు పాల్గొన్నారు. హంస వాహన సేవ ఇల్లందకుంట శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సీతారాములను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హంస వాహనంపై డప్పు చప్పుళ్ల మధ్య దేవాలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. హనుమాన్ స్వాములతోపాటు భక్తులు పల్లకి ఎత్తుకొని రామ నామం జపిస్తూ సేవలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ ఎక్కటి సంజీవరెడ్డి, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మొయినాబాద్(చేవెళ్ల): కలియుగ దైవం చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. వారం రోజులపా టు కొనసాగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకు లు ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ చేశా రు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతి ష్టించి అర్చకులు పరావస్తు రంగాచార్యులు ఆ« ద్వర్యంలో బ్రహ్మోత్సవాల పూజా కార్యక్ర మాలు ఘనంగా నిర్వహించారు. మొదట సె ల్వర్ కూత్తు నిర్వహించి.. వేద మంత్రోచ్ఛారణ తో దేవాలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం పు ట్ట బంగానం (పుట్ట మన్ను) తీసుకొచ్చి హోమగుండాలు ఏర్పాటు చేసి.. అందులో నవధాన్యా లు, పాలికలు కలిపి హోమాలను వెలిగించారు. తరువాత విష్వక్సేనుడి ఆరాధన, పుణ్యహవచన కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి ఉ త్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించిన అనంతరం యజ్ఞం చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్న్ సౌందరరాజన్, అర్చకులు రంగరాజన్, వరదరాజన్, బాలాజీ, మురళీ, కన్నయ్య, నర్సింహన్, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నేడు గరుడ ప్రసాదం వితరణ... చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు మంగళవారం ధ్వజారోహణం, శేషవాహనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి సమర్పించే నైవేద్యాన్ని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. గరుడ ప్రసాదం కోసం అధిక సంఖ్యలో మహిళలు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయం ముందు భాగంలో టెంట్లు వేసి తగిన ఏర్పాట్లు చేశారు. -
బ్రహ్మోత్సవాలకు వేట వెంకన్న ముస్తాబు
గార్ల : మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గార్ల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 15 నుంచి అక్టోబర్ 21 వరకు నిర్వహించబోతున్నట్లు ఆలయ పూజారులు శేషుస్వామి, మధుస్వామి తెలిపారు. మండలకేంద్రమైన గార్లకు మూడు కిలోమీటర్ల దూరంలోని మర్రిగూడెం గ్రామం వద్ద వెలిసిన వేట వేంకటేశ్వరస్వామికి ప్రతీ ఏటా ఆశ్వయుజమాసంలో వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుపతి వేంకటేశ్వరస్వామి స్వయంగా వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అవతరించారని భక్తుల విశ్వాసం. సుమారు 500 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి చెందిన రామాయణం వెంగలయ్య అనే పేద చాత్తాద వైష్ణవునికి స్వామి దర్శనమిచ్చాడని, ఇక్కడ తనకొక ఆలయం నిర్మించి నిత్య దూపదీప నైవేద్యాలతో ఆరాధించాలని వేంకటేశ్వరస్వామి ఆజ్ఞాపించగా వెంగలయ్య గ్రామ ప్రముఖుల సహకారంతో ఆలయం నిర్మించారని ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు. వేంకటేశ్వరస్వామితో పాటు శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలు భూపాలపల్లి పట్టణంలోని ‘ఒంటిమీసం తోట’ అనే ఉద్యానవనంలో లభ్యం కాగా డోర్నకల్ సమీపంలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన మల్లం గోపయ్య, మల్లం నర్సయ్య ఇక్కడకు తెచ్చి ప్రతిషి్ఠంచారు. నాటి నుంచి వంశపారంపర్యంగా అదే కుటుంబానికి చెందిన వారు స్వామి వారి కల్యాణానికి తలంబ్రాలు తీసుకొస్తున్నారు. దేశంలో ఎక్కడా వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో జంతుబలి ఇవ్వరు. కానీ మర్రిగూడెం వేంకటేశ్వరస్వామికి భక్తులు జంతుబలులు ఇవ్వడం విశేషం. ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, కృష్ణా జిల్లాలకు చెందిన భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. స్వామివారి కల్యాణం యాగ్నికము పూజారి కల్వకుంట్ల వెంకన్నచార్యులు, బుచ్చమయ్యచార్యులు నిర్వహిస్తారు. ఈ నెల 15 రాత్రి గార్లలోని వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను మర్రిగూడెంలోని దేవాలయానికి తీసుకొచ్చి అంకురార్పణ జరుపుతామని ఆలయ పూజారి తెలిపారు. 16న ద్వజారోహణం, కల్యాణం, 17న హోమ బలిహరణ, 18న గరుడవాహనసేవ, 19న దేవాలయం ఎదుట కోనేటిలో స్వామివారి తెప్పోత్సవం, 20న అశ్వవాహనసేన, 21న దోపోత్సవం, చక్రస్నానం, నాగబలిపుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అర్చకులు శేషుస్వామి, మధుస్వామి కోరారు.