6న ధవళగిరి జనార్దనుడి కల్యాణం
Published Fri, Feb 3 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) :
శ్రీదేవి, భూదేవి సమేతంగా ధవళగిరిపై కొలువుదీరిన శ్రీలక్షీ్మజనార్దనస్వామి వారి దివ్య కల్యాణోత్సవాలు ఈ నెల ఆరు నుంచి ప్రారంభం కానున్నాయి. 11వ తేదీ వరకూ నిర్వహించే ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ధవళగిరిని, ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రథోత్సవానికి, కల్యాణోత్సవానికి తరలిరానున్నారు. 7న భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారి రథోత్సవం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.
Advertisement
Advertisement