
శ్రీవారి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎక్కడచూసినా క్యూలైన్లే కనిపిస్తున్నాయి. సాయంత్రం 3 గంటల సమయానికి 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. అదేవిధంగా కాలినడక వచ్చే భక్తుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది.