
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. గురువారం అర్ధరాత్రి వరకు 62,529 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 29, 730 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.51 కోట్లు సమర్పించారు.
టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 5 గంటల సమయం. ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది.