తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 69,870 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.
42,119 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 7 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.
ప్రారంభమైన అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలు
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నిన్న సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగ్గా.. ఈ ఉదయం 6.55 నుంచి 7.25 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 25 వరకు అప్పలాయగుంట వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
21 దాకా తిరుచానూరు తెప్పోత్సవాలు
నేటి నుంచి ఐదు రోజులపాటు(ఈనెల 21వ తేదీ దాకా) తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు పద్మసరోవరంలో తెప్పలపై అమ్మవారు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక తెప్పోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment