యాదాద్రి(నల్లగొండ): తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణమాసం ప్రారంభం కావడంతో లక్ష్మినరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి ధర్మ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు వాహనాలను కొండపైకి అనుమతించడంలేదు.