
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. నిన్న 73,811 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 34,901 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.19 కోట్లు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది