చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నానికి 31 కంపార్టుమెంట్లు నిండాయి. సాధారణ దర్శనానికి 15 గంటలు, కాలినడక భక్తులకు 7 గంటల సమయం పడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావటంతో అలిపిరి గేట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో కూడా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడం విశేషం.