తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 65,131 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 30,998 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 5 గంటల సమయం.
ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం , ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది.
టీటీడీకి భారీ విరాళం
తిరుమల 2024 ఆగస్టు 29: హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఎస్ బ్రదర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు, శ్రీ రాజమౌళి, శ్రీ ప్రసాద రావు, శ్రీమతి మాలతీ లక్ష్మీ కుమారిలు బుధవారం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.3.70 కోట్లు విరాళంగా అందజేశారు.
ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం లోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాతలు విరాళం చెక్కును అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment