శ్రీశైలదేవస్థానానికి మినీ బస్సులు
శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మినీ బస్సులను ఏర్పాటు చేస్తుంది. మొత్తం మూడుబస్సుల్లో మంగళవారం రెండు బస్సులు శ్రీశైలానికి వచ్చాయి. వీటికి ఈఓ నారాయణభరత్ గుప్త , జేఈఓ హరినాథ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బస్సులను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో, «ధార్మిక ప్రచారానికి వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.