సమస్యల కొలిమి | problems Furnace | Sakshi
Sakshi News home page

సమస్యల కొలిమి

Published Thu, Mar 6 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

problems  Furnace

 ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమన్న పేరు. భద్రాద్రి తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయంగా కీర్తి. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం. కానీ సదుపాయాల మాటకు వస్తే మాత్రం చెప్పడానికి ఏమీ ఉండదు. జిల్లాలోని రామతీర్థం క్షేత్రం దుస్థితి ఇది. స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడకు విచ్చేసే భక్తులకు తాగేందుకు కనీసం మంచినీరు ఉండదు. ఇళ్లకు తీసుకువెళ్లేందుకు ప్రసాదమూ దొరకదు. పోనీ కాసేపు రాముని సన్నిధిలో విశ్రాంతి తీసుకుందామనుకున్నా షెల్టర్లు కూడా లేవు.
 
 రామతీర్థం(నెల్లిమర్ల), న్యూస్‌లైన్: రామతీర్థం దేవాలయం వార్షికాదాయం కోటిన్నర పైమా టే. ఏటా ఇరవై లక్షలకు తగ్గకుండా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. కానీ అధికారులు మాత్రం భక్తుల సంఖ్యకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, వసతి షెల్టర్ల విషయంలో అధికారులు ఘో ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా ఏ ఒక్కరూ పరిస్థితి మార్చడానికి చర్యలు తీసుకోవడం లేదు.  
 
  సుమారు 500 ఏళ్ల కిందటి ఈ ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యం గా శివరాత్రి, శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. ఒక్క శివరాత్రి నాడే పదిలక్షల మంది భక్తు లు రామతీర్థం వస్తారు. ఏటా ఆలయానికి సుమారు కోటిన్నర రూపాయల ఆదా యం లభిస్తుంది. ఆలయానికి సంబంధించి 888 ఎకరాల పంట భూములున్నాయి. ఇన్ని ఉన్నా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

కనీస స్థాయిలో కూడా భక్తులకు సౌకర్యాలు కల్పించలేక పోతున్నారని పలువురు ఆరోపిస్తున్నా రు. ఈ విషయంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భ క్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తు తం ఆలయానికి వచ్చే భక్తులకు ఆల యంలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కోవడానికి కుళాయిలు కూడా లేవు. గతం లో ఇక్కడున్న కుళాయిలు చాలాకా లం కిందటే పాడయ్యాయి. ఇప్పటివరకు వాటిని పట్టిం చుకున్న నాథుడే లేడు. దీంతో అందరూ కోనేరు వద్దకు వెళ్లాల్సి వస్తోం ది. అలాగే భక్తులకు తాగునీరు కూడా అందుబాటులో లేదు. గతంలో భక్తుల సౌకర్యార్థం ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి న మినరల్ వాటర్ ప్లాంటు కు సంబంధించి ఒకే ఒక్క కుళాయి ఏర్పాటు చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అది కూడా నిరుపయోగంగా మారుతోంది. దీంతో భక్తులు ఆలయం వెలుపల విక్రయించే వాటర్ ప్యాకెట్లు కొనుక్కుని తాగాల్సి వస్తోంది. ఇక ప్రసాదం విషయానికొస్తే గత నాలుగేళ్లుగా ఇక్కడికొచ్చే భక్తులకు ప్రసాదం సక్రమంగా అందడం లేదు.
 
 ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ మాత్రమే ఇక్కడ పులిహోర ప్రసాదం దొరుకుతుంది. తర్వాత వచ్చే భక్తులకు తినేందుకు, ఇళ్లకు తీసుకెళ్లేందుకు రాముల వారి ప్రసాదమే దొరకదు. ఈ విషయంలో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే దేవస్థానానికి విచ్చేసే భక్తులకు మరుగుదొడ్లు, స్నానపు గదులు అందుబాటులో లేవు. గతంలో ఇక్కడ నిర్మిం చిన సామూహిక మురుగుదొడ్లు ఐదేళ్ల క్రితమే నిరుపయోగంగా మారాయి. దీంతో భక్తులు తీవ్రంగా ఇక్కట్లకు గురవుతున్నారు. అలాగే స్నానపు గదులు కూడా అందుబాటులో లేవు. దీంతో మహిళా భక్తులకు ఇబ్బంది కలుగుతోంది.
 
 కోనేటిలో స్నానాలు చేసినా దుస్తులు మా ర్చుకునేందుకు గదులు లేకపోవడంతో తం టాలు పడుతున్నారు. ప్రతి ఏటా కోట్ల లో ఆదాయం సమకూరుతున్నా.. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేస్తున్న సౌకర్యాలు కేవలం ధనికులు, వీఐపీలకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దే వాదాయ శాఖ అధికారులు కల్పించుకుని భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement