సంగమేశ్వరంలో భక్తల సందడి | devotees in sangameswaram | Sakshi
Sakshi News home page

సంగమేశ్వరంలో భక్తల సందడి

Published Fri, Feb 24 2017 10:28 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

సంగమేశ్వరంలో భక్తల సందడి

సంగమేశ్వరంలో భక్తల సందడి

కొత్తపల్లి: ఏడు శివరాత్రి పర్వదినాల తర్వాత ఈ ఏడాది మొదటిసారి పండుగ రోజున భక్తులకు సంగమేశ్వరుని దర్శనభాగ్యం లభించింది. ఏటా శివరాత్రి పండగ నాటికి సప్తనదీజలాల్లో నీటి మట్టం తగ్గకపోవడంతో స్వామివారు జల గర్భంలోనే ఉండేవారు. ఏడేళ్ల తర్వాత ఈ ఏడాది నదిలో నీరు తగ్గడంతో శివరాత్రి సందర్భంగా శుక్రవారం జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహబూబ్‌నగర్‌ నుంచి వేలాదిగా భక్తులు   వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొన్నారు. ముందుగా దిగువఘాట్‌కు చేరుకొని సప్తనదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. శివనామస్మరణ పఠిస్తూ కాయ, కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement