మార్కెట్‌ను ముంచెత్తిన మిర్చి
25వేల పైచిలుకు బస్తాల రాకా
వ్యాపారుల సిండికేటు, పడిపోయిన ధర
శివరాత్రికి ముందు మూడు రోజులు బంద్.. శనివారం నుంచి మళ్లీ మూడు దినాలు వరంగల్ మార్కెట్‌కు సెలవు కావడంతో శుక్రవారం మిర్చి పోటెత్తింది. ఒక్క రోజే సుమారు 25 వేలకు పైగా బస్తాలను రైతులు తీసుకురావడంతో యార్డులన్నీ ఎర్రబంగారమయ్యూరుు.
వరంగల్ వ్యవసాయ మార్కెట్ ఎరుపెక్కింది. శుక్రవారం పెద్ద ఎత్తున మిర్చి ముంచెత్తింది. ఈ సీజన్‌లో తొలిసారిగా అన్ని రకాల మిర్చి కలిపి దాదాపుగా 25 వేల బస్తాలు వచ్చారుు. మార్కెట్‌కు సెలవుల తర్వాత మళ్లీ మూడు రోజులు వరుసగా సెలవులున్నాయనే సమాచారంతో రైతులు త్వరపడ్డారు. దీంతో వ్యాపారులు సిండికేటై ధరను ఒక్కసారిగా త గ్గించారు. నాలుగు రోజుల కిందట తేజ రకం మిర్చి క్వింటాల్ ధర రూ.8వేలు పై చిలుకు పలికింది. వండర్ హాట్, దీపిక, యూఎస్-341 రకాలకు రూ.10వేల ధర పలికింది. శుక్రవారం వీటిలో సగానికి ధర తగ్గించేశారు.
అధికారులు, యూర్డు ఇన్‌చార్జి కల్పించుకోకపోవడంతో.. అడ్తిదారుల మాటలు న మ్మి ఎంతోకొంతకు అమ్ముకున్నారు కొందరు రైతులు. పూర్తిస్థాయి మిర్చి సీజన్ ప్రారంభం కాకముందే ఇలాంటి పరిస్థితి ఉండడం రైతులను కలవరపెడుతోంది. మార్కెట్ అధికారులు, యార్డు ఇన్‌చార్జిలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తే తప్ప మిర్చి ధర పెరిగే అవకాశాల్లేవు. ఇదే జరిగితే రైతులు ఇతర రాష్ట్రాల మార్కెట్లకు మిర్చి తరలించే అవకాశం ఉంది.
- వరంగల్‌సిటీ
నిండుగా.. దండిగా
Published Sat, Feb 21 2015 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement