మహాశివరాత్రికి పోటెత్తిన భక్తజనం
1.25 లక్షల వుందికి దర్శనభాగ్యం
లఘుదర్శనంతో... శివరాత్రి సక్సెస్స్
శభాష్ రామిరెడ్డి..
సావూన్యులకు సువర్ణదర్శనం
స్కౌట్స్ సేవలు అభినందనీయుం
శ్రీకాళహస్తి: దక్షిణకైలాసంగా పేరొందిన శ్రీకాళహస్తి క్షేత్రం మంగళవారం భక్తుల శివనావుస్మరణలతో మార్మోగింది. శివరాత్రి పర్వదినాన స్వామి, అవ్మువార్ల దివ్యదర్శనం కోసం భక్తులు లక్షలాదిమంది తరలివచ్చారు. దీంతో ఆలయు ప్రాంగణవుంతా కిక్కిరిసిపోరుుంది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నుంచి సామాన్యుల వరకు అందరికీ లఘు దర్శనం అమలుచేశారు. అధికారులు ఊహించిన మేర కంటే భక్తులు తాకిడి అధికమైనప్పటికీ ఈవో రామిరెడ్డి ప్రణాళికాబద్ధంగా క్యూలను ఏర్పాటు చేయించడంతో భక్తులు సులువుగా స్వామివారిని దర్శించుకోగలిగారు. అరుుతే పలువురు ఆలయాధికారులు వూత్రం ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వీఐపీలు, తమ ఆప్తుల సేవల్లో తరించిపోయూరు. అరుునప్పటికీ స్కౌట్స్, వలంటీర్లు ఈవోకు పూర్తిగా సహకరించడంతో ఉత్సవం విజయువంతంగా పూర్తిచేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయు ప్రాంగణాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే స్వామివారి మూలవిరాట్‌లతోపాటు ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలతో అలంకరించారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. అప్పటి నుంచే భక్తులు స్వర్ణముఖినదిలో స్నానాలు చేసి, ఆలయానికి రావడం ప్రారంభించారు. రద్దీని నిలువరించడానికి సాధారణ భక్తులతో పాటు వీఐపీలకు అధికారులు ప్రత్యేక క్యూను ఏర్పాటు చేశారు.
ఇసుకేస్తే రాలని జనం
మహాశివరాత్రిని పురస్కరించుకుని పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఉదయం నుంచి భక్తులు రద్దీ గంటగంటకు పెరగడంతో ఎటుచూచినా భక్తజనంతో ఆలయం నిండిపోయింది. ఇక మధ్యాహ్నం తర్వాత భక్తుల రద్దీ ఇసుకేస్తే రాలనంతగా జనసందడి కనిపించింది. 1.25 లక్షలకుపైగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే 50 వేలమంది భక్తులు మాత్రమే టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
శభాష్ రామిరెడ్డి
శ్రీకాళహస్తీశ్వరాలయుంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ లో పక్కా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగడంతో భక్తులకు ఇబ్బందులు తప్పాయని, ఈవో పని తీరు శభాష్ అని పలువురు కొనియాడారు. శివరాత్రిరోజు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 200 మంది తన అనుచరులతో పట్టువస్త్రాల సమర్పణకు హాజరైనా క్యూ ఏర్పాటు చేయుడంతో ఆటంకాలను అధికమించి సావూన్య భక్తులకు సైతం దర్శనం కలిగించారు. ఈ ఏడాది డీఎస్పీ వెంకటకిషోర్ పోలీసులకు పలు సలహాలిస్తూ పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టారు.
భక్తులకు అందుబాటులో ప్రసాదాలు
భక్తులకు ఇబ్బందులు లేకుండా పులిహోర, లడ్డు,వడ,జిలేబీలను సిద్ధం చేశారు. సుపథావుండపంలో ప్రత్యేకంగా పదికౌంటర్లను ఏర్పాటుచేయుడంతో ప్రతిభక్తుడు ప్రసాదాన్ని సౌకర్యవంతంగా అందుకున్నాడు. అంతేకాకుండా ఆలయుం తరపున ఉచితప్రసాదాలను అందించడం జరిగింది. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమా ల్లో సినీ గాయకుడు హేమచంద్ర బృందం సంగీత విభావరి ప్రేక్షకులను మైమరిపించింది. స్వర్ణవుుఖినదిలో భక్తులు స్నానాలు చేసుకునేందుకు, వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి అధికారులు చేసిన ఏర్పాట్లు విజయువంతవుయ్యూరుు. ఈవో రామిరెడ్డికి అధికారు లు పూర్తిసహకారం అందించకపోరుునప్పటికీ ఆయున వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో శివరాత్రి ఉత్సవాన్ని దిగ్విజయుంగా పూర్తిచేయుగలిగారని పలువురు అభిప్రాయపడ్డారు. బుధవారం తెల్లవారుజావుున వుూడుగంటలకు లింగోద్భవ దర్శనభాగ్యం ప్రతి భక్తుడు పొందేలా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
శివం శంకరం
Published Wed, Feb 18 2015 2:38 AM | Last Updated on Sat, Sep 15 2018 8:00 PM
Advertisement
Advertisement