‘‘దేవగణార్చిత సేవిత లింగం
భావై ర్భక్తిభిరేవ చ లింగమ్!
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్!!’’
...శైవక్షేత్రాల్లో భక్తిగీతాలు మార్మోగుతుండగా ‘హరహర శంకర భ క్తవ శంకర.. శంభో హరహర నమోఃనమోః’ అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శివరాత్రి సందర్భంగా మంగళవారం అన్ని రోడ్లూ, వాహనాలు భక్తులతో కిటకిటలాడారుు. అర్చకులు మంత్రోచ్ఛారణ చేసి స్వామివారికి పూలు, విభూది, రుద్రాక్ష లు, బిళ్వదళాలు సమర్పించారు. శివలింగాలకు పాలాభిషేకం చేశారు. జాతర జరిగే ప్రాంతాలకు వేలాది గా తరలివచ్చిన భక్తులు అక్కడే ఉన్న కొలను, నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. పలువురు ప్రముఖులు క్షేత్రాలను సందర్శించి పూజలు చేశారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఖమ్మం కల్చరల్: ద్వాదశ జ్యోతిర్లింగాల ఏర్పాటు జిల్లాకే గర్వకారణమని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పోంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వీటిని ఏర్పాటు చేసిన బ్రహ్మకుమారీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నగరంలోని టీటీడీ కల్యాణమండపంలో ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కైలాస, ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం, చైతన్య అలంకారాల ప్రదర్శన మంగళవారంతో నాలుగో రోజుకు చేరింది. మహాశివరాత్రి ప్రత్యేక ఆహ్వానితులుగా నాల్గో రోజు ఇక్కడకు విచ్చేసి ప్రదర్శనను తిలకించారు. బ్రహ్మకుమారీలు జ్యోతిర్లింగాల విశిష్టతను ఎంపీకి వివరించారు. ఆధ్యాత్మికత వల్ల లభించే ప్రశాంతత గురించి చెప్పారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రలకు చెందిన జ్యోతిర్లింగాలను ప్రత్యేక చొరవ తీసుకుని ఖమ్మంలో ప్రదర్శనగా ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. వాటి విశిష్టతను తెలియజెప్పేందుకు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్న బ్రహ్మాకుమారీల కృషిని కొనియాడారు. మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న ప్రదర్శన విజయవంతం కావాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మకుమారీలు ఏర్పాటు చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి తనవంతు సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు.
ప్రజాశ్రేయస్సు కోసం శివాలయూల్లో ప్రత్యేక పూజలు చేశా..
ప్రజల శ్రేయస్సుకోసం జిల్లాలోని వివిధ శివాలయాల్లో శివరాత్రిని పురష్కరించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు ఎంపీ తెలిపారు. క్షీరాభిషేకం, రుద్రాభిషేకం తదితర పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. జిల్లా ప్రజానీకం పాడిపంటలతో తులతూగాలని పరమేశ్వరుని కోరానన్నారు. శివాలయూల అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటిని బ్రహ్మకుమారీలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షర్మిలాసంపత్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి సాధు రమేశ్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎండీ ముస్తఫా, జిల్లా నాయకులు జిల్లేపల్లి సైదులు, పత్తి శ్రీను పాల్గొన్నారు.
హరోం హర
Published Wed, Feb 18 2015 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement
Advertisement