ఉరుకుందకు పోటెత్తిన భక్తులు
కౌతాళం: శివరాత్రిని పురస్కరించుకుని ఉరుకుంద శ్రీఈరన్న స్వామి దేవాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఎంతో నిష్టతతో క్యూలో నిల్చుకొని స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామి వారి మూలవిరాట్‌ను ప్రత్యేక ఫలపుష్పాలతో ఆలంకరించి సుప్రభాతసేవ, మహామంగళ హారతి, ఆకుపూజ నిర్వహించారు.