సుదీర్ఘ నిద్రాత్యాగం | The sacrifice of a long sleep | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ నిద్రాత్యాగం

Published Thu, Mar 17 2016 10:37 PM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

ఏడాదికోసారి వచ్చే శివరాత్రి రోజు జాగారం చేస్తేనే మర్నాడు నిద్రతో కళ్లు కూరుకుపోతుంటాయి.

తిక్క లెక్క

ఏడాదికోసారి వచ్చే శివరాత్రి రోజు జాగారం చేస్తేనే మర్నాడు నిద్రతో కళ్లు కూరుకుపోతుంటాయి. మర్నాడు చుక్క చూడనిదే జాగరణను విరమించరాదనే పట్టుదలతో నిద్రను ఆపుకొని కొందరు ఆ తర్వాత నానా తంటాలు పడుతుంటారు. ఫొటోలో కనిపిస్తున్న రాండీ గార్డనర్ అనే ఈ అమెరికన్ కుర్రాడు ఏకంగా పదకొండు రోజులు.. కచ్చితంగా చెప్పాలంటే 264 గంటల 24 నిమిషాలు నిద్రపోకుండా గడిపి గిన్నెస్ రికార్డు బద్దలు కొట్టాడు.

ఇదేమీ ఇటీవలి రికార్డు కాదు లెండి. రాండీ తన పదహారేళ్ల వయసులో.. అంటే 1964లోనే ఈ రికార్డు సాధించాడు. ఈ రికార్డు కోసం అతడు ఎలాంటి మందులను, ఉత్ప్రేరకాలను వాడలేదు. ఇప్పటి వరకు ఈ రికార్డు అతడి పేరు మీదే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement