సుదీర్ఘ నిద్రాత్యాగం
తిక్క లెక్క
ఏడాదికోసారి వచ్చే శివరాత్రి రోజు జాగారం చేస్తేనే మర్నాడు నిద్రతో కళ్లు కూరుకుపోతుంటాయి. మర్నాడు చుక్క చూడనిదే జాగరణను విరమించరాదనే పట్టుదలతో నిద్రను ఆపుకొని కొందరు ఆ తర్వాత నానా తంటాలు పడుతుంటారు. ఫొటోలో కనిపిస్తున్న రాండీ గార్డనర్ అనే ఈ అమెరికన్ కుర్రాడు ఏకంగా పదకొండు రోజులు.. కచ్చితంగా చెప్పాలంటే 264 గంటల 24 నిమిషాలు నిద్రపోకుండా గడిపి గిన్నెస్ రికార్డు బద్దలు కొట్టాడు.
ఇదేమీ ఇటీవలి రికార్డు కాదు లెండి. రాండీ తన పదహారేళ్ల వయసులో.. అంటే 1964లోనే ఈ రికార్డు సాధించాడు. ఈ రికార్డు కోసం అతడు ఎలాంటి మందులను, ఉత్ప్రేరకాలను వాడలేదు. ఇప్పటి వరకు ఈ రికార్డు అతడి పేరు మీదే ఉంది.