మహాశివరాత్రి సందర్భంగా చెరువులో స్నానానికి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
చిత్తూరు: మహాశివరాత్రి సందర్భంగా చెరువులో స్నానానికి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన సదుం మండలకేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాలు.. సదుం మండలకేంద్రానికి చెందిన చంద్ర ఏకైక కుమారుడు దిలీప్(13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం మాహాశివరాత్రి సందర్భంగా సదుం మండల కేంద్రంలోని చిక్కరాల చెరువులోకి స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతడు చెరువులో మునిగి మృతి చెందాడు.