
మదనాపురం రైల్వే గేటు వద్ద అంబులెన్స్. (ఇన్‌సెట్‌లో) అంబులెన్స్‌లో చనిపోయిన శివ
మదనాపురం: రైల్వేగేటు పడడంతో సకాలంలో వైద్యం అందక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తి జిల్లా మదనాపురంలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంటకు చెందిన దండు శివ(45)కు గురువారం సాయంత్రం గుండెనొప్పి రావడంతో వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వనపర్తి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అక్కడికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. మదనాపురం వనపర్తి రైల్వేగేట్ స్టేజీ వద్ద గేటు పడింది.
పావుగంటపాటు అంబులెన్స్ ఆగిపోయింది. తోటి ప్రయాణికులు గేటు తీయాలని పట్టుబట్టడంతో గేట్‌మేన్ ఉన్నతాధికారులతో మాట్లాడి గే టు తెరిచి పంపించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సకాలంలో వైద్యం అందక శివ చనిపోయాడు. అతనికి భార్య జ్యోతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
(చదవండి: Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..!)
Comments
Please login to add a commentAdd a comment