
ప్రియుడి దాడిలో గాయపడిన ప్రియురాలు మృతి
గుత్తి : గుత్తిలో గత సోమవారం ప్రియుడు శివ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి (25) కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం గుత్తికి తరలించారు. ఈ ఘటనలో ప్రియుడు శివను ఇదివరకే పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.