దీక్షను కొనసాగిస్తాం.. | Uber, Ola Cab Drivers Hunger Strike | Sakshi
Sakshi News home page

దీక్షను కొనసాగిస్తాం..

Published Fri, Jan 6 2017 12:27 AM | Last Updated on Thu, Aug 30 2018 9:02 PM

దీక్షను కొనసాగిస్తాం.. - Sakshi

దీక్షను కొనసాగిస్తాం..

క్యాబ్‌ డ్రైవర్లు, ఓనర్లకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగ దని, ఇందుకోసం అవసరమైతే తన ఇంట్లో నైనా ఆమరణ నిరాహార దీక్షను కొనసాగి స్తామని తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్,

సంస్థలు పారిపోవాలి.. లేదంటే డ్రైవర్లకు న్యాయం జరగాలి
ఓలా, ఉబెర్‌ దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగుతుంది
తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్, ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ


హైదరాబాద్‌: క్యాబ్‌ డ్రైవర్లు, ఓనర్లకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగ దని, ఇందుకోసం అవసరమైతే తన ఇంట్లో నైనా ఆమరణ నిరాహార దీక్షను కొనసాగి స్తామని తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్, ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉలుకుండకర్‌ శివ స్పష్టం చేశారు. బుధవారం ఇందిరా పార్కు వద్ద క్యాబ్‌ డ్రైవర్ల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో.. శివతో పాటు మరికొందరు గురువారం ఉదయం మణికొండలో తమ ఆమరణ దీక్షను కొనసా గించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన డ్రైవర్లు, ఓనర్లు దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శివ మాట్లా డుతూ.. ఓలా, ఉబెర్‌ సంస్థలు తమ ఆర్థిక నిల్వలను పెంచుకునేందుకు.. వాటిలో పని చేస్తున్న డ్రైవర్లను నిలువునా ముంచుతున్నా యన్నారు.

 మొదట్లో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించి డ్రైవర్లు, వాహనాలను చేర్చుకుని ఇప్పుడేమో వాటిని తగ్గించి మోసం చేస్తున్నా యని ఆరోపించారు. కొత్త వాహనాలను చేర్చుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నా యని, సంస్థలను నమ్ముకుని రంగంలోకి వచ్చిన వారిని మోసం చేస్తున్నాయన్నారు. వారు పెట్టే టార్గెట్‌లను అధిగమించేందుకు ఒక్కో డ్రైవర్‌ రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేయాల్సి వస్తోందన్నారు. ఆ సంస్థలు  డ్రైవర్లు, ఓనర్లకు న్యాయం చేయాలని, లేదంటే ఇక్కడి నుంచి సంస్థలు పారిపోయే వరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. తమ సమస్యల పరిష్కారానికి సంస్థలతో పాటు ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లినా న్యాయం జరగకపోవటంతోనే రోడ్డు ఎక్కా ల్సి వచ్చిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం దిగి వచ్చి సంస్థలతో పాటు తమను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

నాటకీయ పరిణామాల మధ్య..
బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో గురువారం ఉదయం మణికొం డలోని ఓ వ్యక్తికి చెందిన స్థలంలో క్యాబ్‌ డ్రైవ ర్లు దీక్షను తిరిగి ప్రారంభించారు. రోడ్లపై ఇతర క్యాబ్‌లను ఆపుతుండటంతో ట్రాఫిక్‌ నిలిచిపోవటం, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి అనుమతి లేకుండా దీక్షను చేపట్టినందుకు కేసులు నమోదు చేస్తామని స్థల యజమానిని హెచ్చరించారు. సమావే శం అంటే సరే అన్నానని, దీక్ష విషయం తన కు తెలియదని, స్థలాన్ని వెంటనే ఖాళీ చేయా లని యజమాని ఒత్తిడి చేయటంతో డ్రైవర్లు సాయంత్రం దీక్షా శిబిరాన్ని ఖాళీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement