⇒ ఆల్ సెయింట్స్ గెలుపు
⇒ ఎ-డివిజన్ వన్డే లీగ్
హైదరాబాద్: శివ (131 బంతుల్లో 80; 3 ఫోర్లు) రాణించడంతో ఆల్‌సెయింట్స్ హైస్కూల్ 3 పరుగుల తేడాతో యంగ్ మాస్టర్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆల్‌సెయింట్స్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. సాత్విక్ రెడ్డి 33, సయ్యద్ ఇబ్రహీం 22 పరుగులు చేశారు. ప్రఫుల్ 3, రాహుల్ 2 వికెట్లు తీశారు.
తర్వాత లక్ష్యఛేదనకు దిగిన యంగ్ మాస్టర్స్ జట్టు 45.4 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఆలౌటైంది. సూరి (55) అర్ధసెంచరీ చేయగా, విష్ణువర్ధన్ 36, ప్రఫుల్ కుమార్ 36 పరుగులు చేశారు. ముస్తాక్ అహ్మద్, సాత్విక్, ముజ్తాబా తలా 2 వికెట్లు తీశారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
అను సీసీ: 267 (జై మాన్‌సింగ్ 89, రోహిత్ భగత్ 45; పృథ్వి 3/52), భారతీయ సీసీ: 214 (చంద్రశేఖర్ 52, తుషార్ 31; రోహిత్ భగత్ 5/20).
మహావీర్ సీసీ: 128 (బాలాజీ 51; వివేక్ 5/14, విష్ణు 5/18), ఆర్‌జేసీసీ:132/7 (వివేక్ 45 నాటౌట్). టీమ్ కున్: 180/7 (సహస్ర రెడ్డి 95; అభినవ్ 5/31), తారకరామ: 98 (అనిరుధ్ 5/29, ధీరజ్ 3/15).
విజయ్ సీసీ: 215/9 (అర్జున్ కుమార్ 119, హర్ష్ 3/32, రుత్విక్ 3/55), సఫిల్‌గూడ: 66 (అర్జున్ 3/33, ఫరీద్ బాబా 5/30).
హైదరాబాద్: 326/5 (సౌభిక్ 110 నాటౌట్, మానవ్ 48, పీయూశ్ 33), సత్యం కోల్‌టస్: 90 (రంగస్వామి 4/17).
రాణించిన శివ
Published Wed, Sep 7 2016 2:30 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
Advertisement
Advertisement