సినిమా పూర్తి చేయడం, హిమాలయాలకు వెళ్లి, కొన్ని రోజులు ఉండి రావడం రజనీకాంత్ అలవాటు. మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా షూటింగ్ పూర్తి చేయడంతో పాటు తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పి, హిమాలయాలు వెళ్లారాయన. అక్కడ్నుంచి రాగానే తన 168 సినిమాపై దృష్టి పెడతారు. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. కాగా రజనీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12)న ఈ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నారని కోలీవుడ్ టాక్.
మామూలుగా ఒక సినిమాకి సంబంధించిన నటీనటులందరినీ అధికారికంగా ప్రకటించేవరకూ కీలక తారాగణం అయిన హీరోయిన్, విలన్ పాత్రధారుల గురించి రకరకాల వార్తలు వస్తుంటాయి. అలా ఈ చిత్రంలో రజనీ సరసన జ్యోతిక కథానాయికగా నటించనున్నారనే వార్త ప్రస్తుతం షికారు చేస్తోంది. రజనీ సరసన జ్యోతిక ఇప్పటివరకూ నటించలేదు. అయితే రజనీ కీలక పాత్రలో రూపొందిన ‘చంద్రముఖి’ సినిమాలో ప్రభు భార్యగా జ్యోతిక నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. రజనీ 168లో సూపర్ స్టార్ సరసన నటించబోయే హీరోయిన్ జ్యోతికా? కాదా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment