Muragadoss
-
‘దర్బార్’ ఆడియో ఫంక్షన్
-
శంకర్ తర్వాత మురుగదాస్ : రజనీకాంత్
‘‘నేను తమిళనాడుకి వచ్చేటప్పుడు నాపై నమ్మకంతో ఇక్కడ అడుగు పెట్టించిన వారి నుంచి.. నాపై నమ్మకంతో సినిమాలు రూపొందించిన దర్శక–నిర్మాతలందరి నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు. ఇప్పుడు ‘దర్బార్’తోనూ మీ నమ్మకాన్ని వమ్ము చేయను’’ అని హీరో రజనీకాంత్ అన్నారు. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘దర్బార్’. లైకాప్రొడక్షన్స్ పతాకంపై ఎ.సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. నిర్మాత ఎవి.ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. అనిరుద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చెన్నైలో విడుదల చేశారు. రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘సుభాస్కరన్ నాకు మంచి స్నేహితుడు. తనొక నిర్మాతగానే మనకు తెలుసు. కానీ, లండన్‌లో తను పెద్ద బిజినెస్ మేన్. తన నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో ‘2.0’ సినిమా చేస్తున్నప్పుడు మా బ్యానర్లో మరో సినిమా చేయాలనడంతో సరే అన్నాను. మురుగదాస్‌గారి ‘రమణ, గజినీ’ చిత్రాలు బాగా నచ్చాయి. అప్పుడే ఆయనతో సినిమా చేయాలనుకున్నాను కానీ ఇప్పటికి కుదిరింది. శంకర్‌లా ఎంటర్టై¯Œ మెంట్‌తో పాటు మెసేజ్ ఇచ్చే సినిమాలు చేసే మురుగదాస్‌తో పనిచేయం ఆనందంగా అనిపించింది. డిసెంబర్ 12న నా బర్త్‌డేని అభిమానులు సెలబ్రేట్ చేయవద్దు. ఆ డబ్బులతో పేదలకు, అనాథలకు సాయం చేయండి’’ అన్నారు. ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ ‘‘నాకు ఊహ తెలిసి మా ఊరిలో థియేటర్లో నేను చూసిన హీరో రజనీకాంత్‌గారే. ఆయనతో సినిమా తీయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల్లాగా నేను కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు డైరెక్టర్ శంకర్. ‘‘2.0’ తర్వాత రజనీకాంత్‌గారితో మా బ్యానర్లో చేసిన చిత్రం ‘దర్బార్’’ అన్నారు ఎ.సుభాస్కరన్. -
బర్త్‌డేకి ఫిక్స్
సినిమా పూర్తి చేయడం, హిమాలయాలకు వెళ్లి, కొన్ని రోజులు ఉండి రావడం రజనీకాంత్ అలవాటు. మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా షూటింగ్ పూర్తి చేయడంతో పాటు తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పి, హిమాలయాలు వెళ్లారాయన. అక్కడ్నుంచి రాగానే తన 168 సినిమాపై దృష్టి పెడతారు. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. కాగా రజనీకాంత్ పుట్టినరోజు (డిసెంబర్ 12)న ఈ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నారని కోలీవుడ్ టాక్. మామూలుగా ఒక సినిమాకి సంబంధించిన నటీనటులందరినీ అధికారికంగా ప్రకటించేవరకూ కీలక తారాగణం అయిన హీరోయిన్, విలన్ పాత్రధారుల గురించి రకరకాల వార్తలు వస్తుంటాయి. అలా ఈ చిత్రంలో రజనీ సరసన జ్యోతిక కథానాయికగా నటించనున్నారనే వార్త ప్రస్తుతం షికారు చేస్తోంది. రజనీ సరసన జ్యోతిక ఇప్పటివరకూ నటించలేదు. అయితే రజనీ కీలక పాత్రలో రూపొందిన ‘చంద్రముఖి’ సినిమాలో ప్రభు భార్యగా జ్యోతిక నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. రజనీ 168లో సూపర్ స్టార్ సరసన నటించబోయే హీరోయిన్ జ్యోతికా? కాదా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
డబుల్ ధమాకా!
గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘2.ఓ’ చిత్రంలో శాస్త్రవేత్తగా, రోబోగా రజనీకాంత్ రెండు పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల టాక్. ఇందులో సామాజికవేత్తగా, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో రజనీకాంత్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజం అయితే... మళ్లీ రజనీ అభిమానులకు డబుల్ ధమాకానే. ఒకవేళ రెండు పాత్రలు చేస్తే అప్పుడు ఇద్దరు హీరోయిన్లకు ప్లేస్ ఉంటుంది. ఇప్పటికే పలువురు కథానాయికల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ నయనతార, కాజల్ అగర్వాల్‌ల పేర్లు స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. మరి.. రజనీ సరసన జోడీ కట్టే ఇద్దరు భామలు ఎవరో మార్చిలో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ మార్చిలో స్టార్ట్ అవుతుందని సమాచారం. అన్నట్లు.. ఇంతకుముందు ‘రాజాధిరాజా (1989), అదిశయ పిరైవి (1989), ముత్తు (1995), అరుణాచలం (1997)’ చిత్రాల్లో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. -
బర్త్‌డే గిఫ్ట్
మహేశ్‌బాబు బర్త్‌డే నేడు. ఆ విషయం ఫ్యాన్స్‌కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లను ఖుషీ చేయాలని ‘స్పైడర్’ టీమ్ ఓ గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేసింది. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రసమర్పకుడు ‘ఠాగూర్’ మధు, నిర్మాత ఎన్వీ ప్రసాద్, దర్శకుడు మురుగదాస్ ఈ రోజు కొత్త టీజర్‌ను విడుదల చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెల 23 వరకు పాట షూటింగ్ జరుగుతుంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. మరోవెపు డబ్బింగ్, రీ–రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుతున్నాం. దసరా కానుకగా సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.