పైడి రమేశ్, కె.రాఘవేంద్రరావు
శివ, సోనా పటేల్ జంటగా పైడి రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్’ (ది పవర్ ఆఫ్ పీపుల్). శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై పైడి సూర్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 9న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో బిగ్ సీడీని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల విడుదల చేశారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు మోషన్ పోస్టర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ లుక్, నిర్మాత అశ్వినీదత్ టీజర్, డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసారు. సినిమా విజయం సాధించాలని వీరందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పైడి రమేశ్ మాట్లాడుతూ– ‘‘హీరో ఒక యువజన నాయకుడు. తన కుటుంబంతో పాటు ఎన్నో నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఈ చిత్రం కథాంశం. ఈ చిత్రంతో రమణ సాయి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం’’ అన్నారు. ‘‘ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యం. మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యం అని తెలియజేసే మంచి సందేశం ఉన్న చిత్రం ఇది. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు పైడి సూర్యనారాయణ . ఈ చిత్రానికి కెమెరా: బాల, సహ నిర్మాత: పాంగ కోదండరావు.
Comments
Please login to add a commentAdd a comment