ఆయన నా బ్రాండ్‌ హీరో.. వర్మ | director ram gopal varma post nagarjuna photos in twitter | Sakshi
Sakshi News home page

ఆయన నా బ్రాండ్‌ హీరో.. వర్మ

Published Fri, Feb 16 2018 1:53 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

director ram gopal varma post nagarjuna photos in twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలన డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘తన ట్వీటర్‌ అకౌంట్‌లో అక్కినేని నాగార్జున ఫొటోలు రెండు పోస్టు చేశాడు. ఈ రోజునే (ఫిబ్రవరి 16న) నా మొదటి సినిమా శివ తొలి రోజు చిత్రీకరణ చేశాం. ఈ సందర్భంగా నా బ్రాండ్‌ హీరో నాగార్జున ఫొటోలు ఇదిగో. 25 సంవత్సరాల అన్వేషణ తర్వాత నాకు ఓ కొత్త  యాక్టర్‌ దొరికాడు. అతనేవరో కాదు.. అక్కినేని నాగార్జునే. ఇంతకముందు చూడని రియలిస్టిక్‌ యాక్షన్ హీరోను నాగార్జునలో చూస్తారు’ అని వర్మ ట్వీట్‌ చేశారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వర్మ కంపెనీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్‌ ఓ పోలీసాఫీసర్‌ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతోంది.




No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement