
నాగార్జున
ఇన్వెస్టిగేషన్‌లో ప్రొగెస్ వచ్చింది. క్లూ దొరికింది. అందుకే ముంబై వెళ్లి విలన్స్‌ను రఫ్పాడిస్తున్నారు హీరో నాగార్జున. మామూలుగా కాదు.. గన్‌తో చేజ్ చేస్తూ, పంచ్ మీద పంచ్‌లిస్తూ కుమ్మేస్తున్నారు. అంటే.. ముంబైలో డిష్యూం..డిష్యూం అన్నమాట. నాగార్జున హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్ చంద్రతో కలిసి రామ్‌గోపాల్ వర్మ స్వీయదర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శపథం: మై రివెంజ్ కంప్లీట్స్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్.
ఇందులో పోలీసాఫీసర్ పాత్రలో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఐజా షేక్ సారథ్యంలో నాగార్జున, అజయ్, షాయాజీ షిండే కాంబినేషన్‌లో ఫైట్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నాం. ముంబైలోని ఎస్సెల్ వరల్డ్ అనే ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌లో చేజింగ్ సీన్స్ కూడా తీస్తున్నాం. మార్చి 10వరకు కొనసాగే ఈ షెడ్యూల్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయడానికి ప్లాన్ చేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment