‘కంగువ’ నాకెంతో స్పెషల్‌ : హీరో సూర్య | Actor Suriya Interesting Comments About Kanguva Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Suriya On Kanguva Movie: ‘కంగువ’ నాకెంతో స్పెషల్‌

Published Sun, Mar 24 2024 11:04 AM | Last Updated on Sun, Mar 24 2024 1:25 PM

Suriya Talk About Kanguva Movie - Sakshi

'కంగువ' లాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు స్టార్ హీరో సూర్య. ఆయన నటించిన ఈ ప్రెస్టీజియస్ మూవీ త్వరలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా ముంబైలో 'కంగువ' గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ - గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్ గా మారుతూ వచ్చింది. అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి. కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయాలన్న కలగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు. అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు

. ప్రతి సినిమాకు స్క్రిప్ట్ కు మేకింగ్ కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు ప్రతి రోజూ బెటర్ గా వర్క్ చేస్తూ వచ్చాం. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్ గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు  150 రోజులకు పైగా చేసిన షూట్ లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. మీ అందరికీ కంగువ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement