యువతితో నటుడు పరార్‌ | Actor Shiva Escape With Neighbour Daughter in Tamil nadu | Sakshi
Sakshi News home page

యువతితో నటుడు పరార్‌

Jan 5 2019 11:11 AM | Updated on Jan 5 2019 11:11 AM

Actor Shiva Escape With Neighbour Daughter in Tamil nadu - Sakshi

నటుడు శివ

సినీ నటుడు శివ పక్కింటి యువతితో పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

తమిళనాడు, పెరంబూరు: సినీ నటుడు శివ పక్కింటి యువతితో పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వివరాలు.. పయపుళై అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన నటుడు శివ. తిరువణ్ణామలై జిల్లాలోని చెంజి గ్రామానికి చెందిన ఇతను స్థానిక రామావరంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివశిస్తున్నాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. శివకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పక్కింటి యువతితో పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. భార్యకు విడాకులిచ్చినట్లు అబద్దం చెప్పి ఆ యువతితో ప్రేమ పెంచుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు వారించినా వినిపించుకోలేదు. అంతే కాదు నటుడు శివతో కలిసి పరారైంది.

పోలీస్‌స్టేషన్‌లో చేరిన జంట..
దీనిపై యువతి తల్లిదండ్రులు రాయలనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ గౌతమన్‌ దర్యాప్తు చేపట్టారు. కాగా వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లడంతో పారిపోయిన జంట శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. విచారణలో శివ తన భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలిసింది. అంతే కాదు శివ ఆ యువతితో కలిసి కన్యాకుమారి, మదురై తిరిగొచ్చినట్లు తెలిసింది. తన భార్యకు విడాకులు ఇచ్చి ఈ యువతిని పెళ్లి చేసుకుంటానని పోలీసులకు చెప్పాడు. ఆ యువతిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement