పూరీ ఆ సినిమాలో నటించారా? వర్మ ట్వీట్‌.. | Puri Jagannadh Act In ShIva Movie | Sakshi
Sakshi News home page

పాటలో స్టెప్పులేస్తున్న పూరీ జగన్నాథ్‌

Jun 24 2019 6:20 PM | Updated on Jun 24 2019 6:48 PM

Puri Jagannadh Act In ShIva Movie - Sakshi

శివ సినిమా... అప్పట్లో రికార్డులను బద్దలుకొట్టింది. మూస ధోరణిలో కాకుండా వినూత్నంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా గురించి ఇపుడో వార్త బయటకొచ్చింది. శివ హిందీ వెర్షన్‌లో మాస్‌ సినిమాల దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నటించారంట. అవునా.. ఎక్కడా కన్పించలేదే అనుకోకండి...! కేవలం బోటనీ పాఠముంది... పాటలో మాత్రమే పూరీ కన్పిస్తారు. ఈ విషయాన్ని వీడియోతో సహా ట్విటర్‌లో పంచుకున్నారు సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. అప్పటి జూనియర్‌ ఆర్టిస్ట్‌.. ఇప్పుడు సినిమా దర్శకుడు అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై పూరీ స్పందిస్తూ.. అవును, అందులో డ్యాన్స్‌ చేస్తోంది నేనేనంటూ రీ ట్వీట్‌ చేశారు. వర్మ పంచుకున్న ఈ వీడియోలో నీలి రంగు షర్ట్‌లో ఉన్న పూరీ జగన్నాథ్‌ మిగతావారితోపాటు పాటలో స్టెప్పులేస్తూ కనిపిస్తారు. టాలెంట్‌ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నిదర్శనమంటూ రాంగోపాల్‌ వర్మ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement