( ఫైల్ ఫోటో )
తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. సీజన్.. సీజన్‌కి ఈ షోకి ఆదరణ పెరిగిపోతుంది. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా బిగ్‌బాస్ ఐదో సీజన్ హోస్ట్ కింగ్ నాగార్జున స్వయంగా ప్రకటించారు. గత మూడు సీజన్స్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగ్.. ఓటీటీ బిగ్‌బాస్‌కి కూడా హోస్టింగ్ చేయనున్నాడు. మరో రెండు నెలల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభంకానుంది.
ఈ నేపథ్యంలో ఈ ఓటీటీ బిగ్‌బాస్ ఎలా ఉంటుంది? ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
వీరితో పాటు డ్యాన్స్ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో యాంకర్ శివ, వర్షిణి, రాజు, వైష్ణవి పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ బిగ్‌బాస్ షో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ ఓటీటీ నిర్వాహణను ప్రముఖ బుల్లి తెర యాంకర్ ఓంకార్ సంస్థ అయిన ‘ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్’కు అప్పజెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment