
‘‘రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే ఈ సినిమా తీయాలనేది మా ఇద్దరి (వర్మ, రాకేశ్‌రెడ్డి) ఆంతరంగిక అభిమతం’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని తీయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని పి. రాకేశ్‌రెడ్డి నిర్మించనున్నారు. ‘‘ఒక్క అడుగు (లక్ష్మీ పార్వతిది) ఓ వ్యక్తి (ఎన్టీఆర్) హృదయంలో ప్రేమను, వందలమంది హృదయాల్లో ద్వేషాన్ని సృష్టించింది. కానీ, అదే అడుగు లక్షలమంది మళ్లీ ఆయన్ను ప్రేమించేలా చేసింది – ఇదే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రకథ’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ.
Comments
Please login to add a commentAdd a comment