ప్రభాస్ కల్కిలో టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్.. ఇప్పటికే! | Ramgopal Varma and Rajamouli Will Acts In Prabhas Starrer Kalki 2898 AD | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: కల్కిలో ఆర్జీవీ, రాజమౌళి.. సోషల్ మీడియాలో వైరల్!

Sep 7 2023 6:19 PM | Updated on Sep 7 2023 6:59 PM

Ramgopal Varma and Rajamouli Will Acts In Prabhas Starrer Kalki 2898 AD - Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఇన్ని రోజులు ప్రాజెక్ట్-కె పేరుతో నిర్మించిన ఈ మూవీ టైటిల్‌ను ఇటీవలే మేకర్స్‌ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే బాలీవుడ్‌, కోలీవుడ్ నుంచి అగ్రతారలు సైతం ఈ మూవీలో కీలక రోల్స్ చేస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్ నటించినున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్‌ వినిపిస్తోంది. టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్స్‌ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారనేది లేటెస్ట్ టాక్. అదేంటో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: అమ్మాయిగా మారేందుకు సర్జరీ చేయించుకున్న జబర్దస్త్‌ సాయి?)

ప్రభాస్ కల్కి చిత్రంలో టాలీవుడ్‌ డైరెక్టర్స్ రాంగోపాల్ వర్మ గెస్ట్‌ రోల్ పోషిస్తున్నరంటూ వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి సైతం నటిస్తున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా ఆర్జీవీ పేరు తెరపైకి రావడం మరింత ఆసక్తిగా మారింది. అంతే కాకుండా ఇప్పటికే వీరిద్దరు తమ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేసినట్లు సమాచారం.

అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరీ దీనిపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఏదేమైనా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో వైరలవుతోంది. కాగా.. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్ భామ దీపిక పదుకొణె నటిస్తోంది. 

(ఇది చదవండి: 'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement