రేయ్‌.. అఖిల్‌ ఆ విషయం నాకు చెప్పలేదూ..! | Nagarjuna’s film with Ram Gopal Varma to be titled either Gun or System? | Sakshi
Sakshi News home page

గన్‌ లేదు.. సిస్టమ్‌ కాదు

Published Wed, Dec 6 2017 12:52 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna’s film with Ram Gopal Varma to be titled either Gun or System? - Sakshi

అవునా..  నాగార్జున–రామ్‌గోపాల్‌ వర్మ తుపాకీ ఎక్కుపెట్టారా? ‘సిస్టమ్‌’ని  ప్రశ్నించబోతున్నారా? .. మంగళవారం ఫిల్మ్‌నగర్‌లో ఇదే చర్చ. దీనికి కారణం లేకపోలేదు.  ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న తాజా చిత్రానికి  ‘గన్‌’, ‘సిస్టమ్‌’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారట.   ఈ రెండిటిలో ఏ టైటిల్‌ని ఫిక్స్‌ చేస్తారబ్బా? అన్నది డిస్కషన్‌. కొంతమంది ‘గన్‌’కి ఫిక్సయ్యారు. ఎందుకంటే,  చేతిలో గన్‌తో సీరియస్‌గా ఉన్న నాగార్జున లుక్‌కి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

కొంతమంది మాత్రం ‘సిస్టమ్‌’కి ఫిక్సయ్యారు. ఎవరేం ఫిక్స్‌ అయినా వర్మ వేరే ఫిక్స్‌ అవుతున్నారు. ‘‘ప్రచారంలో ఉన్న ఈ రెండు టైటిల్స్‌ నిజం కాదు’’ అని ‘సాక్షి’కి క్లారిటీ ఇచ్చారు రామ్‌గోపాల్‌ వర్మ. మరి.. ఏం పెట్టాలనుకుంటున్నారు? అంటే.. ‘శపథం’  అని ఊహించవచ్చు. ఎందుకంటే గాసిప్పురాయుళ్ల కథనాల్లో ఈ టైటిల్‌ కూడా ఉంది. మరి.. ఈ టీమ్‌ ఈ టైటిల్‌కే ఫిక్స్‌ అవుతుందని  శపథం చేయొచ్చా? ఏమో.. మరి.. వర్మ ఏం ఫిక్స్‌ అయ్యారో? వెయిట్‌ అండ్‌ సీ. కాగా ఈ సినిమాలో మైరా సరీన్‌ అనే కొత్తమ్మాయి నాగార్జునతో జోడీ కడుతున్నారు.

అఖిల్‌ చెప్పలేదు..!
అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హాలో’. ఈ సినిమా ఆడియో గురంచి అఖిల్‌ ట్విట్టర్‌లో ‘‘జస్ట్‌.. ‘హాలో’ ఫైనల్‌ ఆడియో మిక్స్‌ విన్నా. సాంగ్స్‌ను మీ అందరికీ వినిపించాలని చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. వెయిట్‌ చేయలేను. ఇవాళ (బుధవారం) సమ్‌థింగ్‌ లాంచ్‌ చేయబోతున్నాను’ అని అఖిల్‌ పేర్కొన్నారు. ‘‘ రేయ్‌.. అఖిల్‌ నువ్వు ఇవాళ సాంగ్‌ను లాంచ్‌ చేస్తున్నావన్న విషయం నాకు చెప్పలేదు? నువ్వు రిలీజ్‌ చేయబోయే సాంగ్‌ ఇదేనా? (పాట క్లిప్పింగ్‌ వీడియోను పోస్ట్‌ చేశారు). ఐ లవ్‌ ది సెట్‌ (పాట సెట్‌ను ఉద్దేశించి)æ’’ అని నాగార్జున సరదాగా ట్వీట్‌ చేశారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఈ నెల 22న విడుదల చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement