
నాగార్జున–రామ్‌గోపాల్ వర్మలది హిట్ కాంబినేషన్. కాదు.. కాదు.. సూపర్ హిట్ కాంబినేషన్. సుమారు 28 ఏళ్ల క్రితం ఈ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘శివ’ సృష్టించిన సెన్సేషన్ అలాంటిది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నాగ్–రాము ఓ సినిమా చేయనున్నారు. ఇటీవల ఈ మూవీ గురించి వర్మ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దర్నీ పక్కన పెడితే నాగ్–టబులది కూడా హిట్ కాంబినేషన్.
‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాల్లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ కేక. అఖిల్ ‘సిసింద్రీ’లో నాగ్‌తో టబు ‘ఆటాడుకుందాం రా.. అందగాడా...’ అంటూ సందడి చేసిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నాగ్ హీరోగా వర్మ దర్శకత్వం వహించనున్న సినిమాలో టబూని నాయికగా తీసుకున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. మరోవైపు.. అఖిల్ తాజా చిత్రం ‘హలో’లో టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారనే వార్త కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment