రామ్‌గోపాల్‌ వర్మకు కొట్టేంత కోపం ఎందుకొచ్చింది? | did u watch ram gopalvarma fighting | Sakshi
Sakshi News home page

రామ్‌గోపాల్‌ వర్మకు కొట్టేంత కోపం ఎందుకొచ్చింది?

Published Mon, Jan 22 2018 6:57 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

did u watch ram gopalvarma fighting - Sakshi

ముంబయి : తన మనసులో ఉన్న మాటనే కాదు.. భావాన్ని కూడా ఏమాత్రం సంకోచం లేకుండా బాహాటంగా బయటపెట్టే వ్యక్తులను లెక్కిస్తే ముందు ప్లేస్‌లో ప్రముఖ దర్శకుడు, నిత్యం వివాదాలతో సావాసం చేసే రామ్‌గోపాల్‌ వర్మ ఉంటారని చెప్పాలి. తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రం జీఎస్‌టీ(గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌). పోర్న్‌స్టార్‌ మియా మల్కోవాతో ఆయన ఈ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది. అయితే, ఇప్పటికే ఈ సినిమా హాట్‌హాట్‌గా చర్చ జరుగుతుండంటం మహిళా సంఘాలు అడ్డు చెబుతుండటం జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే, ఎంత వివాదాస్పద అంశాలను కథాంశంగా తీసుకొని ఆయన తెరకెక్కిస్తారో అంతకంటే ఆకట్టుకునేలా తన చిత్రాలకు పబ్లిసిటీ ఇస్తారు. తాజాగా తన జీఎస్‌టీ చిత్రానికి కూడా ప్రచారంలో భాగంగానే అన్నట్లుగా ఓ వీడియోను వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం పద్మావతి చిత్రం విడుదల కాకుండా పలువురు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అలాంటి ఆందోళన కారులే తన జీఎస్‌టీ చిత్రాన్ని కూడా అడ్డుకునేందుకు వచ్చినట్లు వారందరినీ కూడా వర్మ స్వయంగా కసితీరా తన్నుతున్నట్లు ఓ ఇమేజినరీ వీడియోను రూపొందించి పోస్ట్‌ చేశారు. వర్మ నిజంగా సినిమాల్లో ఫైట్‌ చేస్తే నేటి హీరోలను మించిపోగలరేమో అన్నట్లుంది ఆ వీడియో. మరి మీరు కూడా ఓ లుక్కేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement