
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ హీరో నాగార్జున ప్రధాన పాత్రతో ఓ సినిమా తీయబోతున్నట్లు మంగళవారం తన ఫేస్‌బుక్ పోస్ట్‌చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. తమ కాంబినేషన్‌లో వచ్చిన శివ సినిమాకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు.
అంతేకాదు నేను, నాగ్ చేసిన సినిమాలన్నింటికి ఇది భిన్నంగా ఉంటుదన్నారు. నాకు శివ సినిమా మంచి సక్సెస్‌ని ఇచ్చిదని, ఈ సినిమాతో మరోసారి తన అంచనాలను అందుకుంటానని ఆశిస్తున్నాని పేర్కొన్నారు. కాగా నాగ్ ఆర్‌జీవీ కాంబినేషన్‌లో 25 సంవత్సరాల తరువాత ఓ సినిమా రూపొందనుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment