ఆఫీసర్‌ ఆన్‌ యాక్షన్‌ మోడ్‌ | Nag creze at mumbai in ram gopal varma officer movie fight shoot in MH | Sakshi
Sakshi News home page

ఆఫీసర్‌ ఆన్‌ యాక్షన్‌ మోడ్‌

Published Wed, Mar 7 2018 12:38 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

Nag creze at mumbai in ram gopal varma officer movie fight shoot in MH - Sakshi

‘ఆఫీసర్‌’ చిత్రంలో నాగార్జున...

విలన్స్‌ను రఫ్పాడిస్తున్నాడు హీరో నాగార్జున. ఎక్కడో తెలుసా? ముంబైలోని ఓ ఎల్తైన భవనంపై. మరి..అక్కడే ఎందుకు? అంటే మాత్రం ‘ఆఫీసర్‌’ సినిమా చూడాల్సిందే. నాగార్జున హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్‌ చంద్రతో కలిసి రామ్‌గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆఫీసర్‌’. మైరా సరీన్‌ ఫీమెల్‌ లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. క్లైమాక్స్‌ షూట్‌ మినహా సినిమా కంప్లీట్‌ అయ్యిందని సమాచారం.

ప్రస్తుతం చిత్రబృందం  క్లైమాక్స్‌ను ఫినిష్‌ చేసే పనిలోనే ఉన్నారు. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూట్‌ ఆన్‌లొకేషన్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు నాగార్జున. ఈ ఫొటోను చూస్తుంటే ఆన్‌ డ్యూటీలో విలన్స్‌ను ఆఫీసర్‌ కుమ్మేస్తున్నట్లు ఉంది కదూ!  ‘‘పర్వత శిఖరంపై జివదనీ మాయ దేవాలయం ఉంది. మేము ముంబైలోని పదో ప్లోర్‌పై యాక్షన్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు నాగార్జున. ‘‘నాగ్‌..‘శివ’ సినిమాలో కన్నా ఇప్పుడే నువ్వు ఫిట్‌గా ఉన్నావ్‌. అలా ఎలా మెయిన్‌టెయిన్‌ చేయగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ.  ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయాలనుకుంటున్నారు.
∙‘ఆఫీసర్‌’ చిత్రంలో నాగార్జున..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement