
ఆకాష్ పూరి
తనయుడు ఆకాష్ పూరి హీరోగా దర్శకుడు పూరి జగన్నాద్ తెరకెక్కించిన చిత్రం ‘మెహబూబా’. ఇందులో నేహా శెట్టి కథానాయిక. ఇండో–పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మెహబూబా’ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజుగారి శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌తో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా, గర్వంగానూ ఉంది.
‘మెహబూబా’ మా పూరీ కనెక్ట్స్ గర్వించే సినిమా. ‘ఇడియట్, పోకిరి’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మళ్లీ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌తో కలుస్తున్నాం. మంచి హిట్ సినిమాల తర్వాత మరోసారి ‘దిల్’రాజుగారితో చేతులు కలపటం ఆనందంగా ఉంది. మే11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొన్నారు. ఈ సినిమాకు సంగీతం: సందీప్ చౌతా, కెమెరా: విష్ణు శర్మ కో–ప్రొడ్యూసర్: పూరీ కనెక్ట్స్.
Comments
Please login to add a commentAdd a comment