
అమ్మే నా ఉన్నతికి కారణం: ఆకాష్ పూరీ
భాగ్యనగర్ కాలనీ: జీవితంలో తన ఉన్నతికి తన తల్లే కారణమని, పూరీజగన్నాథ్ తనయుడు, సినీనటుడు ఆకాష్‌పూరి అన్నారు. మదర్స్ డేను పురస్కరించుకొని శనివారం 92.7 బిగ్ ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో ఫోరం సుజనామాల్‌లో ‘మై మామ్... మై హీరో.. రేడియో మూవీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆంధ్రాపోరి సినిమా కథానాయకుడు ఆకాష్‌పూరి, కథానాయిక పుల్కాగుప్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అమ్మే కారణమన్నారు. నాన్న నిత్యం బీజీగా ఉండేవారని, దీంతో అమ్మే అన్నే తానై పెంచిందన్నారు.
ఇకపై అమ్మను చూసుకోవడమే తన బాధ్యతగా పేర్కొన్నారు. చిన్నప్పుడు ఎంతో అల్లరి చేసేవాడినని, కోపం వస్తే అమ్మ తనను కొట్టినా వెంటనే దగ్గరికి తీసుకునేదని తెలిపాడు. 92.7 బిగ్ ఎఫ్‌ఎం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిండెంట్ అశ్విన్ పద్మనాభం మాట్లాడుతూ మదర్స్ డే సందర్భంగా 92.7 బిగ్ ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తమ 45 స్టేషన్లలో ‘మై మామ్.. మై హీరో’ ఆడియో విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఐదు ఉత్తమ కథలను ఎంపిక చేసి ఒకరిని విజేతగా ప్రకటించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రాపోరి సినిమా డెరైక్టర్ రాజ్ మాదిరాజు తదితరులు పాల్గొన్నారు.