
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్ బజార్’’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆకాశ్ పూరి బర్త్ డే (జూలై 25) సందర్భంగా ‘చోర్ బజార్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆకాశ్.. చేతి మీద బచ్చన్ సాబ్ అనే ట్యాటూ కనిపిస్తోంది.
‘‘లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సహ నిర్మాత: అల్లూరి సురేష్ వర్మ.
హ్యాపీ బర్త్‌డే బచ్చన్ సాబ్
తనయుడు ఆకాశ్ పూరి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ వీడియో విడుదల చేశారు. ‘హ్యాపీ బర్త్ డే బచ్చన్ సాబ్.. బచ్చన్ సాబ్ ఎవరనుకుంటున్నారా? ‘చోర్ బజార్’లో మా ఆకాశ్ పేరు. ఈ సినిమా బాగా వస్తోందని విన్నాను.. ఆల్ ది బెస్ట్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎంటైర్ టీమ్. ఆకాష్.. వన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే.. లవ్ యు’’ అని పూరి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment