పూరి జగన్నాథ్ కుమారుడు హీరోగా 'టైమ్ పాస్'!
పూరి జగన్నాథ్ కుమారుడు హీరోగా 'టైమ్ పాస్'!
Published Thu, Oct 9 2014 3:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్దమైంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం కానున్నారు. మరాఠీ చిత్రరంగంలో విజయం సాధించిన 'టైమ్ పాస్' చిత్ర రీమేక్ లో ఆకాశ్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
తాను హీరోగా పరిచయం అవుతున్నానని, ఆ చిత్రానికి దర్శకుడు రాజ్ మాదిరాజు అని ఆకాశ్ తన ఫేస్ బుక్ లో వెల్లడించారు. గతంలో ధోని, లోటస్ పాండ్, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై చిత్రాల్లో ఆకాశ్ బాలనటుడిగా ఆకాశ్ కనిపించారు.
Advertisement
Advertisement