Akash Puri's Peene Ke Baad Romantic Song Out Now - Sakshi
Sakshi News home page

Romantic: ఆకట్టుకుంటున్న ఆకాశ్‌ పూరి కొత్త సాంగ్‌ ‘పీనే కే బాద్‌’

Published Wed, Oct 13 2021 8:42 AM | Last Updated on Wed, Oct 13 2021 10:10 AM

New Song Released From Akash Puris Romantic Movie - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. ఇందులో కేతికా శర్మ హీరోయిన్‌గా నటించారు. అనిల్‌ పాడూరి దర్శకుడు. దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే అందించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘పీనే కే బాద్‌’ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 

‘‘హ్యాపీ హ్యాపీ మామ.. దిల్‌ ఖుష్‌ అవుతుందే పీనేకే బాద్‌...’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘ఇప్పటికే విడుదలైన పాటలతో పాటు ‘పీనే కే బాద్‌’ పాట లిరికల్‌ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాట థీమ్‌కు తగ్గట్లు పబ్‌లో షూట్‌ చేశాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. పూరి జగన్నాథ్, భాస్కరభట్ల లిరిక్స్‌ అందించిన ఈ పాటను ఈ చిత్ర సంగీతదర్శకుడు సునీల్‌ కశ్యపే పాడారు. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన చిత్రం నవంబరు 4న విడుదల కానుంది.

చదవండి: స‌ల్మాన్ ఖాన్‌ని డైరెక్ట్‌ చేయనున్న డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement