
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది.
ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ‘రొమాంటిక్’చిత్ర విడుదల తేదీపై పూరి జగన్నాథ్ స్పష్టతనిచ్చాడు. ఈ సినిమా విడుదల తేదీని రేపు(సోమవారం) మధ్యాహ్నం గం.1:56 నిమిషాలకు ప్రకటిస్తామంటూ పూరి జగన్నాథ్ ట్వీట్ చేశాడు. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతమందిస్తున్నాడు.
Keep an eye out for the exciting announcement, the release date of #Romantic will be announced tomorrow @ 1.56Pm.
— PURIJAGAN (@purijagan) February 9, 2020
Starring @ActorAkashPuri #Ketikasharma
💰 @purijagan @Charmmeofficial
🎬 @anilpaduri
🎼#SunilKashyap
@PuriConnects #PCfilm pic.twitter.com/GGNUalxyqy
చదవండి:
‘నా వైఫ్ దిశ.. తను కనిపించట్లేదు సర్’
‘సరాసరి గుండెల్లో దించావె..’
Comments
Please login to add a commentAdd a comment