
ఎన్నో మాస్ చిత్రాలకు దర్శకత్వం వహించి కమర్షియల్ హిట్లు కొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’ . ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, ఓ వీడియో సాంగ్‌ను విడుదలైన సంగతి తెలిసిందే. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమాలోని మరో సాంగ్‌ను రేపు(శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ‘నా వల్ల కాదే’ లిరికల్ సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. అందులో ఆకాష్ పూరి సముద్ర ఒడ్డున ఫుల్ బాటిల్‌ను ఎత్తి తాగుతూ కనింపించగా.. హీరోయిన్ కేతికా శర్మ ఆకాష్ వెనకాల విచారంగా కుర్చుని ఉన్నారు. దీంతో ఇది ఓ విషాద ప్రేమ గీతం కావచ్చని కొందరు, బ్రేక్ ప్ సాంగ్ ఏమోనని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వేచి చేడాల్సిందే.
‘ఆంధ్రాపోరి’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆకాష్.. ఆ తర్వాత తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ లో నటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ రెండు సినిమాలు ఆకాశ్‌కు మంచి హిట్‌ను ఇవ్వలేకపోయాయి. అయితే ఈసారి తన కొడుకుకు ఎలాగైనా హిట్టు ఇవ్వాలనే కసితో ఉన్నాడు పూరి జగన్నాథ్. ఇందుకోసం చార్మితో పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు అనిల్ పాదూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment