
విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `పోస్టర్`. టి మహిపాల్ రెడ్డి (TMR) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోంది. బుధవారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పోస్టర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 19న పోస్టర్ విడుదలవుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ...``ప్రతి సినిమాకు, ప్రతి నటుడికి పోస్టర్ ఎంతో ఇంపార్టెంట్. `మెహబూబా` సినిమా టైమ్‌లో నాకిష్టమైన ఐమాక్స్ థియేటర్ వద్ద నా సినిమా పోస్టర్ చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యాను. నా పోస్టర్ దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకున్నాను. అటువంటి ఒక మంచి టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలి`` అని కాంక్షించారు.
యంగ్ హీరో విజయ్ ధరణ్ మాట్లాడుతూ ...`హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న ఈ స్టేజ్‌లో నాకు ఇలాంటి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు. నటుడు, దర్శకుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ...`` ప్రతి సినీ కళాకారుడికి పోస్టర్‌తో ఎంతో అనుబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యే టైటిల్. నేను ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను``అన్నారు. దర్శకుడు టి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ....``సినిమా పోస్టర్ నన్ను సినిమా రంగం వైపు రప్పించింది. సంధ్య థియేటర్‌లో కొంత కాలం ఆపరేటర్‌గా పని చేశాను. ఆ తర్వాత డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కొంత కాలం పని చేశాక.. ఫస్ట్ టైమ్ `పోస్టర్` సినిమా డైరెక్షన్ చేశాను. ఇది అందమైన ప్రేమకథ, ప్రతి తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తన కొడుకు భవిష్యత్తు గురించి ఎంత తపన పడతాడో తెలిపే కథ`` అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు అరుణ్, డాన్స్ మాస్టర్ అరుణ్, నటి మధుమతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment